Guntur District: కోడికి తలకాయ ఉందో లేదో తెలీదు కానీ, నీకు మాత్రం బుర్ర లేదు: లోకేశ్ పై అంబటి సెటైర్లు

  • జగన్ పై లోకేశ్ చేసిన ట్వీట్ పై అంబటి ఆగ్రహం
  • నీవు మంత్రివి ఎలా అవుతావయ్యా?  
  • మే 23న మంగళగిరిలో ఏం జరుగుతుందో చూడు!
కోడికి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచి బతికిందని, జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చినప్పుడు, ఆ కోడికి తలకాయ లేకుండా కొన్ని నెలలు బతకడం పెద్ద విచిత్రమేమీ కాదంటూ టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ట్వీట్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.

 ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘నిజంగా నువ్వే ఈ వర్డ్స్ ట్వీట్ చేస్తే ‘శభాష్’ అనాలి. ట్యూటర్ చెబితే రాసుకుని ట్వీట్ చేశావని ప్రపంచమంతా తెలుసు. కోడికి తలకాయ లేదేమో నాకు తెలీదు కానీ, నీకు అసలు బుర్ర లేదు. నీకు బుర్ర ఉంటే.. ఎమ్మెల్సీగా నీవు మంత్రివి ఎలా అవుతావయ్యా? నాకు అర్థం కాలేదు? జగన్మోహన్ రెడ్డి గారిపై కామెంట్ చేసే హక్కు నీకు లేదు. నీవు అంత శక్తిమంతుడివి కాదు. మీ నాన్న పంచన రాజకీయాలు చేసుకుని బతికే ఓ బుర్రలేని తత్వం కల్గిన వ్యక్తివి. 23వ తారీఖున మంగళగిరిలో ఏం జరుగుతుందో నువ్వు చూసిన తర్వాత, కోడికి తలకాయ ఉందో? లేదో? తెలిసిపోతుంది’ అని విమర్శించారు.
Guntur District
mangalagiri
Nara Lokesh
ambati

More Telugu News