Mahesh Babu: మహేశ్ బాబు నాకో వ్యసనం: నమ్రత

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సినీ కపుల్స్ లో మహేశ్ బాబు, నమ్రత జోడీ అటు రియల్ లైఫ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సందర్భం వస్తే చాలు, ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకోవడంలో పోటీ పడుతుంటారు. లేటెస్ట్ గా నమ్రత మహేశ్ గురించి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

 మహేశ్ ఫొటో పెట్టిన నమ్రత దానిపై, "డియర్ డ్రగ్స్ నో థ్యాంక్స్, నాకు ఇప్పటికే మహేశ్ బాబు ఓ వ్యసనంలా మారిపోయాడు" అంటూ క్యాప్షన్ పెట్టింది. డ్రగ్స్ కంటే కిక్ ఇచ్చే మహేశ్ ఉండగా డ్రగ్స్ ఎందుకు? అంటూ నమ్రత పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

 

Go Back to Shorts
Mahesh Babu

More Telugu News