Sridhar Reddy: ఆ స్కూళ్లపై దాడులు మంత్రి సోమిరెడ్డి చేయించారా?: వైసీపీ నేత శ్రీధర్‌రెడ్డి

  • తిరుమలనాయుడిపై దాడిని ఖండిస్తున్నా
  • రౌడీయిజాన్ని ఎప్పటికీ ప్రోత్సహించను
  • మనుక్రాంత్‌రెడ్డికి మద్దతుగా సోమిరెడ్డి పనిచేశారు
టీఎన్ఎస్ఎఫ్ నేత తిరుమలనాయుడు అనేక స్కూళ్లపై దాడులు చేశారని, ఆ దాడులను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేయించారా? అని వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమలనాయుడిపై దాడిని ఖండించారు. రౌడీయిజాన్ని తాను ఎప్పటికీ ప్రోత్సహించబోనని ఆయన స్పష్టం చేశారు.

నెల్లూరు మేయర్‌పై సోమిరెడ్డి కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని శ్రీధర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. వెంకటాచలం మండలంలో పోలింగ్ అనంతరం వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల్లోనూ సోమిరెడ్డి హస్తం ఉందా? అని ప్రశ్నించారు. కావలిలో జరిగిన దాడులను బీదా రవిచంద్ర చేయించాడా? అంటూ నిలదీశారు. జనసేన అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డికి మద్దతుగా సోమిరెడ్డి పనిచేశారని శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Sridhar Reddy
somireddy Chandramohan Reddy
Tirumalanaidu
Manukranth Reddy
Janasena

More Telugu News