Uttar Pradesh: భర్త శరీరఛాయ నచ్చలేదని పెట్రోల్ పోసి తగలబెట్టిన అందమైన భార్య!

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ లో ఓ యువతి తన భర్త శరీర రంగు నచ్చలేదంటూ ఎంత దారుణానికి పాల్పడిందో చూడండి. బరేలీకి చెందిన ప్రేమశ్రీ, సత్యవీర్ సింగ్ లకు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. అయితే, ప్రేమశ్రీ ఎంతో అందంగా ఉండడంతో తనకు దీటుగా భర్త లేడని ఎప్పుడూ బాధపడుతుండేది. భర్త నల్లగా ఉన్నాడంటూ అసహ్యించుకునేది. ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు వచ్చినా అందుకు సత్యవీర్ సింగ్ శరీర రంగే కారణమయ్యేది.

అయితే, ఇద్దరి మధ్య ఇది మామూలే అనుకుని భావించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యేలా ఆ కిరాతకురాలు భర్త సత్యవీర్ సింగ్ ను అగ్నికి ఆహుతి చేసింది. సత్యవీర్ సింగ్ నిద్రిస్తున్న సమయంలో అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దాంతో, ఆ అభాగ్యుడికి తీవ్రంగా ఒళ్లు కాలిపోయి ప్రాణాలు పోయాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సత్యవీర్, ప్రేమశ్రీ దంపతులకు ఐదు నెలల చిన్నారి ఉంది.
Go Back to Shorts
Uttar Pradesh

More Telugu News