Hyderabad: ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’ డైరెక్టర్ పై కేసు నమోదు

  • వినయ్ పై నారాయణగూడ పోలీసుల కేసు నమోదు
  • కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు
  • ఫిర్యాదు చేసిన విద్యార్థినికి  మహిళా సంఘాల మద్దతు
హిమయత్ నగర్ లోని ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’కి చెందిన విద్యార్థిని ఫిర్యాదు మేరకు దాని డైరెక్టర్ వినయ్ పై కేసు నమోదైంది. ఈ మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కాగా, శిక్షణలో భాగంగా విద్యార్థులను ఒంటిపై దుస్తులు విప్పమన్నాడంటూ ఫిర్యాదు చేసిన విద్యార్థినికి మద్దతుగా మహిళా సంఘాలు నిలిచాయి. ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన కార్యాలయం ముందు మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.   
Hyderabad
Himayatnagar
sutradhar action institute

More Telugu News