Rahul Gandhi: రాళ్ల గుట్టల్లో కాలినడకన వెళ్లి 'బలి తర్పణం' పూజలు చేసిన రాహుల్ గాంధీ

  • బ్రహ్మగిరి కొండల్లో దైవదర్శనం
  • సంప్రదాయ దుస్తుల్లో పూజలు
  • ఏడు తరాల పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం  
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి కూడా లోక్ సభకు పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ బ్రహ్మగిరి పర్వతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రఖ్యాతిగాంచిన తిరునెల్లి ఆలయం వద్దకు ఆయన కాలినడకన వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న రాహుల్ రాళ్ల గుట్టలను కూడా లెక్కచేయకుండా పాదరక్షలు లేకుండా నడచి వెళ్లి పాపనాశని నదీతీరంలో ఉన్న తిరునెల్లి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వేదపండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా 'బలి తర్పణం' పూజల్లో పాల్గొన్నారు. ఈ 'బలి తర్పణం' పూజలు ఏడు తరాల పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఉద్దేశించి నిర్వహిస్తారు.
Rahul Gandhi

More Telugu News