కులం వల్లే రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారు: అశోక్ గెహ్లాట్
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని మోదీ భయపడ్డారు
- కుల సమీకరణ కోసం కోవింద్ ను రాష్ట్రపతి చేశారు
- అద్వానీ రాష్ట్రపతి అవుతారని అందరూ భావించారు
రాష్ట్రపతికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బీజేపీ అగ్రనేత అద్వానీని ఆ పార్టీ పక్కన పెట్టేసిందని గెహ్లాట్ విమర్శించారు. అద్వానీని రాష్ట్రపతి పదవితో గౌరవిస్తారని అందరూ భావించారని చెప్పారు. ఇది బీజేపీ అంతర్గత విషయమైనప్పటికీ... తాను ఓ ఆర్టికల్ లో చదివినందున దీనిపై మాట్లాడుతున్నానని తెలిపారు.
కాగా, 2017 జూలైలో రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారు. అదే ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.