modi: నన్నే కాకుండా నా సామాజికవర్గం మొత్తాన్ని కించపరుస్తున్నారు: ప్రధాని మోదీ

  • అక్లుజ్ బహిరంగసభలో రాహుల్ పై విమర్శలు
  • ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ నన్ను వేధిస్తోంది
  • చౌకీదార్ అనే పేరును చౌకీదార్ చోర్ హై అని మార్చేశారు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ నేతలంతా తమ పేర్ల ముందు చౌకీదార్ అని పేరు పెట్టుకుంటే... రాహుల్ దాన్ని చౌకీదార్ చోర్ హై అంటూ మార్చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మోదీ పేరున్నవారంతా మోసగాళ్లని అంటున్నారని విమర్శించారు. వెనుకబడిన మోదీ వర్గాన్ని రాహుల్ కించపరుస్తున్నారని అన్నారు. సోలాపూర్ లోని అక్లుజ్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ మోదీ ఈ మేరకు విమర్శించారు. తనను ఒక్కడినే కాకుండా తమ సామాజికవర్గం మొత్తాన్ని రాహుల్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన తనను ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ వేధిస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలను సహించలేమని చెప్పారు. 
modi
Rahul Gandhi
bjp
congress

More Telugu News