Andhra Pradesh: మరి చంద్రబాబు ఈయన పేరును ఎలా సూచించారు?: ఐవైఆర్ కృష్ణారావు

  • ఏపీ సీఎం వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత
  • బాబు పంపిన జాబితా నుంచే ద్వివేది ఎంపిక
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మాజీ సీఎస్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని సమస్యలకు సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీనే కారణమని చంద్రబాబు చెప్పడాన్ని బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఖండించారు. ఏపీ సీఎం చంద్రబాబు పంపిన జాబితా నుంచే ద్వివేదీ పేరును ఈసీ ఎంపిక చేసిందని వ్యాఖ్యానించారు. ద్వివేదీ సమర్థతతో పనిచేయరు అని అనుకుంటే అసలు ఆయన పేరును ఈసీకి ఎందుకు పంపారని ఐవైఆర్ ప్రశ్నించారు.

ఈరోజు ఐవైఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఎన్నికల సమయంలో సమస్యలకు సీఈవో ద్వివేది కారణమనే బాబు గారికి ఒక ప్రశ్న. అంతకుముందు సీఈవో సిసోడియాని ఆపైన ద్వివేదిని ఎన్నికల సంఘం మీరు పంపించిన లిస్టు నుంచే ఎన్నిక చేసింది. అధికారుల మీద పూర్తి అవగాహన ఉన్న బాబు గారు మరి సమర్థతతో పని చేయడు అనుకుంటే ఈయన పేరు ఎలా సూచించారు?’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
BJP
iyr krishnarao

More Telugu News