Hyderabad: హైదరాబాద్‌ మొజంజాహీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

  • స్థానికంగా ఉన్న ఓ ఫర్నీచర్‌ షాపులో మంటలు
  • ఎగసిపడుతున్న అగ్నికీలలతో భయాందోళనలు 
  • మంటల్ని అదుపు చేస్తున్న సిబ్బంది
హైదరాబాద్‌లోని చారిత్రక మొజంజాహీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఫర్నీచర్‌ షాపులో ఈరోజు అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు శకటాలతో ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదం కారణంగా అబిడ్స్‌ సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Hyderabad
mojamjahi market
Fire Accident

More Telugu News