ashokbabu: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్‌బాబు

  • ప్రమాణం చేయించిన మండలి చైర్మన్‌ షరీఫ్‌
  • హాజరైన ఎంపీ కనకమేడల, మండలి బుద్ధప్రసాద్‌
  • మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని జోస్యం
ఎమ్మెల్సీగా ఎన్నికైన ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు పరుచూరి అశోక్‌బాబు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ, అరవై ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఉద్యోగ సంఘాల నుంచి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది తనకేనని, ఇందుకు కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటానని తెలిపారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, ముఖ్యంగా సీసీఎస్‌ విధానం రద్దు కోసం పోరాడుతానన్నారు. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేస్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కనకమేడల, మండలి బుద్ధ ప్రసాద్ హాజరయ్యారు.
ashokbabu
MLC oth
Chandrababu

More Telugu News