Crime News: ఇంట్లో ఉన్న అర్చకునిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

  • మంగళవారం రాత్రి ఘటన
  • బాధితుడు కేకలు వేయడంతో పారిపోయిన దుండగులు
  • కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఓ అర్చకునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి పారిపోయారు. మంగళవారం రాత్రి తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నంబి శ్రీనివాసులు స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయం అర్చకునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి కత్తులతో దాడులకు పాల్పడ్డారు. హత్య చేసేందుకు ప్రయత్నించగా భయంతో శ్రీనివాసులు కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులను కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ తీసుకువెళ్లారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.
Crime News
murder attack on temple priest
vanaparthi district

More Telugu News