Gujarath: ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా 31 మంది మృతి

  • ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు
  • ఎంపీ, గుజరాత్, రాజస్థాన్ లలో 31 మంది దుర్మరణం
  • తీవ్రంగా నష్టపోయిన రైతులు
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లో 16 మంది, గుజరాత్ లో 9 మంది, రాజస్థాన్ లో ఆరుగురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్, పిలానీ, అజ్మేర్, చిత్తోర్ ఘర్ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
Gujarath
Madhya Pradesh
Rajasthan
rains

More Telugu News