Chandrababu: చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ డబ్బుతో మనవరాలి పెళ్లికి సారె... వృద్ధురాలి ఆనందం!

  • విజయనగరం జిల్లాకు చెందిన సూరమ్మ
  • పెన్షన్ డబ్బులు పొదుపు చేసుకున్న వృద్ధురాలు
  • మనవరాలికి పలు కానుకలు
కొల్లి సూరమ్మ... విజయనగరం జిల్లా పోతనాపల్లి గ్రామానికి చెందిన ఆమె, ఇప్పుడు తన మనవరాలి వివాహం కుదిరిందని చాలా ఆనందపడుతోంది. అంతకుమించి, చంద్రబాబు నెలనెలా ఇస్తున్న పెన్షన్ డబ్బును దాచుకుని మనవరాలికి సారె కొనిచ్చానని సంబర పడుతోంది.

 పెయింటింగ్ పనులు చేసే కుమారుడు, ప్రైవేటు స్కూల్ లో ఆయాగా పనిచేసే కోడలు ఆమెకున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబంలో సూరమ్మ మనవరాలిని కష్టపడి పాలిటెక్నిక్ వరకూ చదివించారు. ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. సూరమ్మకు గత నాలుగేళ్లుగా పింఛన్ అందుతుండగా, అందులో కొంత పొదుపు చేసుకుంది. అలా మిగిల్చిన 30 వేల రూపాయలతో మంచం, పరుపు, ఇత్తడి బిందెలు, బీరువా తదితరాలను మనవరాలికి సారెగా కొనిచ్చింది.
Chandrababu
Penssion
Marriage

More Telugu News