godavari: కాకరపర్రు వద్ద గోదావరిలో మునిగిపోయిన ముగ్గురు యువకులు.. మృత దేహాలు లభ్యం

  • గోదావరి ఒడ్డుకు విహారానికి వచ్చిన యువకులు
  • నదిలో నడుస్తుండగా ప్రమాదం
  • ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక యువకుడు
పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు వద్ద గోదావరి ఒడ్డుకు నిన్న నలుగురు యువకులు విహారానికి వచ్చారు. కాసేపటి తర్వాత నదిలో ఇవతలి వైపు నుంచి అవతలి వైపుకు నడిచి వెళ్లి, తిరిగి వచ్చే సమయంలో ముగ్గురు యువకులు మునిగిపోయారు. ఒక యువకుడు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

ఈ క్రమంలో ఈరోజు కాకరపర్రు వద్ద ముగ్గురు యువకుల మృత దేహాలు లభ్యమయ్యాయి. చనిపోయినవారిని ముత్యాల మణికంఠ, మిర్యాల వంశీ, విజ్జు సాయికిరణ్ గా గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గోదావరి లోతును సరిగా అంచనా వేయకుండా వెళ్లడం వల్ల, ప్రమాదవశాత్తు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
godavari
East Godavari District

More Telugu News