ntr: వైస్రాయ్ ఘటనలో చెప్పులు వేసింది ఎన్టీఆర్ మీద కాదు: ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్

  • లక్ష్మీపార్వతిపై చెప్పులు వేశారు
  • తనపై చెప్పులు వేసినట్టు ఎన్టీఆర్ భావించారు
  • ఎన్టీఆర్ వద్దకు భువనేశ్వరి తరచుగా వచ్చేవారు
తెలుగుదేశం పార్టీ చరిత్రలో వైస్రాయ్ దాడి చాలా కీలకమైన అంశం. వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబు ఏర్పాటు చేసిన క్యాంపులో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో లక్ష్మీపార్వతితో కలసి ఎన్టీఆర్ అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో వారిపై చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ పై చెప్పులు విసిరారంటూ ఇప్పటి వరకు అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్ ఆరోజు ఏం జరిగిందో వివరించారు.

వాస్తవానికి లక్ష్మీపార్వతిపై చెప్పులు విసిరారని... కానీ, తనపైకి విసిరినట్టుగా ఎన్టీఆర్ భావించారని లక్ష్మణ్ తెలిపారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు బలవంతంగా అధికారాన్ని లాక్కున్నారని చెప్పారు. మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్ కు యనమల రామకృష్ణుడు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన వద్దకు చంద్రబాబు భార్య భువనేశ్వరి తరచుగా వచ్చేవారని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.


ntr
lakshmi parvathi
driver
chappals
chandrababu
Telugudesam

More Telugu News