Mahaveer jayanthi: హైదరాబాద్‌లో నేడు మాంసం దుకాణాలు బంద్

  • నేడు మహావీర్ జయంతి
  • మాంసం దుకాణాలు బంద్ చేయాలంటూ జీహెచ్ఎంసీ ఆదేశాలు
  • ఆదేశాలు ఉల్లంఘించి తెరిస్తే కఠిన చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాంసం దుకాణాలు నేడు మూతపడ్డాయి. మహావీర్ జయంతిని పురస్కరించుకుని బుధవారం మాంసం దుకాణాలు మూసివేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, కబేళాలు, రిటైల్ మాంసం దుకాణాలను కూడా బంద్ చేయాలని, జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోలీస్ కమిషనరేట్లకు సూచించారు.
Mahaveer jayanthi
GHMC
Dana kishore
Hyderabad
mutton shops

More Telugu News