Palaniswami: ఓటరుకు స్వయంగా డబ్బులు పంచుతూ దొరికిన ముఖ్యమంత్రి పళనిస్వామి

  • పాంప్లెట్  లో డబ్బులు పెట్టి ఇచ్చిన ముఖ్యమంత్రి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • తేని జిల్లాలోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పోలీసుల కాల్పులు
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఓటరుకు డబ్బులు ఇస్తూ  కెమెరాకు చిక్కారు. మంగళవారం రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఓటరుకు ఆయన పాంప్లెట్లతోపాటు డబ్బులు కూడా పంపిణీ చేశారు. ఓ పండ్ల దుకాణం వద్దకు వెళ్లిన పళనిస్వామి అక్కడున్న మహిళతో మాట్లాడుతూ తమకు ఓటేయాలని కోరారు. సీఎం తన వద్దకు రావడంతో ఆమె ఆనందంగా అరటిపండ్లు ఇచ్చింది. అవి తీసుకున్న పళనిస్వామి పాంప్లెట్లలో డబ్బులు పెట్టి తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. మహిళకు సీఎం డబ్బులు ఇస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కి అనంతరం సోషల్ మీడియాకు ఎక్కింది.

మరోవైపు, తేని జిల్లాలోని అన్నాడీఎంకే కార్యాలయంలో పోలీసులు రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.

Palaniswami
Tamil Nadu
Caught
distributing money
Paneerselvam

More Telugu News