jagan: గవర్నర్ కు జగన్ ఫిర్యాదుపై చంద్రబాబు స్పందన

  • ఏం తప్పులు జరిగాయని ఫిర్యాదు చేశారు?
  • వాళ్లే దాడులకు పాల్పడి.. వాళ్లే ఫిర్యాదు చేస్తారా?
  • వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తే భయం ఎందుకు?
గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధినేత జగన్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీపై గవర్నర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ... రాష్ట్రంలో ఏం తప్పులు జరిగాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. వైసీపీ నేతలే దాడులకు పాల్పడి, వాళ్లే ఎలా ఫిర్యాదు చేస్తారని అడిగారు. వీవీప్యాట్ లో స్లిప్ లు కౌంటింగ్ చేస్తే జగన్ కు ఎందుకు భయమని ప్రశ్నించారు.

వీవీ ప్యాట్ స్లిప్ లు కౌంటింగ్ వద్దని మోదీ, కేసీఆర్ చెప్పారా? అని అన్నారు. వీరిద్దరికీ జగన్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. వీవీప్యాట్ లను లెక్కించాల్సిందేనని... ఈ విషయంపై దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకొస్తానని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీని ఓడించాలని పిలుపునిచ్చానని... దాంతో అక్కడ బీజేపీ ఓటమిపాలయిందని అన్నారు.
jagan
Chandrababu
governor
Telugudesam
ysrcp

More Telugu News