chiranjeevi: శంకర్ దర్శకత్వంలో చిరంజీవి .. నిర్మాతగా అల్లు అరవింద్

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పుడే, ఆయనతో తన బ్యానర్లో ఒక భారీ బడ్జెట్ చిత్రం ఉంటుందని అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే వరుసగా చిరంజీవి సినిమాలకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇక అల్లు అరవింద్ బ్యానర్లో చిరంజీవి సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఉందనీ .. ఈ సినిమాకి భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడనేది తాజా సమాచారం. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమా కోసం కథను సిద్ధం చేయమని అల్లు అరవింద్ .. శంకర్ కి చెప్పారని అంటున్నారు. తెలుగులో చిరంజీవి కథానాయకుడైతే, తమిళంలో అజిత్ తో గానీ .. విజయ్ తో గాని ఈ ప్రాజెక్టు చేసేలా మాటలు జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' చేస్తున్నారు. ఆ తరువాత కొరటాల .. త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇక శంకర్ విషయానికొస్తే 'భారతీయుడు 2' పనులతో బిజీగా వున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత శంకర్ - చిరంజీవి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.
Go Back to Shorts
chiranjeevi
shankar

More Telugu News