kannada: కన్నడ స్టార్ హీరోపై ఐటీ దాడులు

  • సుమలత తరపున ప్రచారం నిర్వహిస్తున్న దర్శన్
  • టి.నరసీపుర ఫాంహౌస్ పై ఐటీ దాడులు
  • సమాచారం అందినా ప్రచారాన్ని కొనసాగిస్తున్న దర్శన్
కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. మాండ్య లోక్ సభ స్వతంత్ర అభ్యర్థి సుమలత తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో మైసూరు జిల్లా టి.నరసీపురలో ఉన్న దర్శన్ ఫాంహౌస్ పై నిన్న ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫాంహౌస్ లో ఉన్న అన్ని ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఓవైపు ఐటీ దాడులు జరుగుతున్నాయన్న సమాచారం అందినప్పటికీ... దర్శన్ మాత్రం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.

కాంగ్రెస్ సీనియర్ నేత జీఏ బావా నివాసంపై కూడా నిన్న రాత్రి ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐటీ దాడుల విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇదే రీతిలో పలువురు నేతలు, వారి అనుచరుల నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ దాడులు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.
kannada
actor
darshan
sumalatha
it raids

More Telugu News