jagityal: జగిత్యాలలో ఆటోల్లో అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు.. కలకలం

  • నిజామాబాద్ లోక్ సభ పరిధిలో జగిత్యాల 
  • అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
  • స్ట్రాంగ్ రూమ్ కు తరలించామన్న ఆర్డీవో
తెలంగాణలోని జగిత్యాలలో ఈవీఎంల తరలింపు వ్యవహారం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎన్నికల సిబ్బంది ఆటోల్లో ఈవీఎంలను తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో... ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జగిత్యాల ఆర్డీవో మాట్లాడుతూ, ఇవి గ్రామాల్లో అవగాహన కోసం వాడిన పాత ఈవీఎంలు అని చెప్పారు. పాత స్ట్రాంగ్ రూమ్ కు వీటిని తరలించామని తెలిపారు.

మరోవైపు, ఇవి పాత ఈవీఎంలు అయినప్పుడు అర్ధరాత్రి పూట వాటిని తరలించాల్సిన అవసరమేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పగటి పూట తరలించవచ్చు కదా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున కవిత ఎన్నికల బరిలో ఉన్నారు.
jagityal
evm
auto

More Telugu News