Chandrababu: ప్రజలను బిచ్చగాళ్లను చేసిన చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరే: సీపీఐ రామకృష్ణ

  • చంద్రబాబు ఎంత పంచారో, జగన్ అంత పంచారు
  • రూ. 600 కోట్లు ఖర్చు పెట్టిన జగన్
  • డబ్బు వెదజల్లడంలో పోటీ పడ్డారన్న రామకృష్ణ
ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు ఎంత డబ్బు ప్రజలకు పంచాడో, జగన్ కూడా అంతే మొత్తాన్ని ప్రజలకు పంచారని, ఓటర్లను బిచ్చగాళ్లను చేయడంలో ఇద్దరూ ఇద్దరేనని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీతో సమానంగా జగన్ రూ. 600 కోట్లను పంపిణీ చేశారని ఆరోపించారు. రెండు పార్టీలూ డబ్బు వెదజల్లడంలో పోటీ పడ్డాయని, ఎన్నికలంటే వేలం వేసి అభ్యర్థులను గెలిపించడం కాదని ఆయన అన్నారు. డబ్బు మద్యం ఏరులై పారిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యం అపహాస్యమైనట్టేనని అన్నారు.
Chandrababu
Jagan
CPI Ramakrishna

More Telugu News