BJP: మరో ఇద్దరు నేతలపై ప్రచార నిషేధం.. మేనకా గాంధీ, ఆజంఖాన్ కు ఈసీ ఆదేశాలు

  • కేంద్ర మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీకి 48 గంటలు
  • సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కి 72 గంటలు నిషేధం
  • ఈ మేరకు ఈసీ ఆదేశాలు
ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను  కొన్ని గంటల పాటు ప్రచారం చేయొద్దంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. తాజాగా, మరో ఇద్దరు నేతలకు కూడా ఈసీ నుంచి నిషేధపు ఆదేశాలు అందాయి. కేంద్ర మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ 48 గంటలు, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనేందుకు వీలులేదని ఆ ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.
BJP
Menaka Gandhi
samjavadi party
aajam khan

More Telugu News