dokka: ముఖ్యమంత్రి పీఠం చంద్రబాబుదే: డొక్కా జోస్యం

  • టీడీపీ అత్యధిక సీట్లను గెలుచుకోబోతోంది
  • ఈసీ వైఫల్యాలపై విచారణ జరిపించాలి
  • ఎన్నికల సంస్కరణలకు ఇదే సరైన సమయం
అత్యధిక సీట్లను టీడీపీ గెలుచుకోబోతోందని ఆ పార్టీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ జోస్యం చెప్పారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని... ఈసీ వైఫల్యంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సరైన ప్రణాళిక లేకుండానే ఈసీ ఎన్నికలను నిర్వహించిందని విమర్శించారు. ఈసీ వైఫల్యంపై దేశం మొత్తాన్ని చంద్రబాబు అలర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సంస్కరణలకు ఇదే సరైన సమయమని అన్నారు. 
dokka
Chandrababu
Telugudesam
ec

More Telugu News