Andhra Pradesh: ఏపీలో ఈసారి టీడీపీకి 120 సీట్లు వస్తాయి!: చలమలశెట్టి రామానుజయ

  • పసుపు-కుంకుమను మహిళలు ఆదరించారు
  • భారీగా ఓటింగ్ లో పాల్గొని టీడీపీకి పట్టం కట్టారు
  • కృష్ణా జిల్లాలో మీడియాతో టీడీపీ నేత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని మహిళలు విశేషంగా ఆదరించారని టీడీపీ ఆర్గనైజింగ్‌ కమిటీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ తెలిపారు. అందుకే మహిళలు భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని టీడీపీకి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కైకలూరు వైసీపీలో క్రాస్ ఓటింగ్ జరిగిందనీ, దీనివల్ల టీడీపీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

కృష్ణా జిల్లాలోని కలిదిండిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రామానుజయ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ 120 సీట్లు దక్కించుకోవడం ఖాయమని చలమలశెట్టి  రామానుజయ జోస్యం చెప్పారు. టీడీపీ నాయకుడు, కార్యకర్తలు ఎన్నికల వేళ సైనికుల్లా పనిచేశారనీ, ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పనిచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
ramanujaya
Krishna District

More Telugu News