Vaishnavi: చంద్రబాబు మరోసారి సీఎం కావాలని వైష్ణవి మొక్కులు!

  • అమరావతికి రూ. లక్ష విరాళమిచ్చిన వైష్ణవి
  • మెచ్చుకుని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన చంద్రబాబు
  • ఆయనే సీఎం కావాలంటూ ఆంజనేయునికి మొక్కులు
అమరావతి బ్రాండ్ అంబాసిడర్, 9వ తరగతి చదివే వైష్ణవి గుర్తుందా? గత సంవత్సరం చంద్రబాబును కలిసిన వైష్ణవి, అమరావతి నిర్మాణానికి తాను దాచుకున్న లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఆమె నిబద్ధతను ఎంతో మెచ్చుకున్న చంద్రబాబు, ఆమెను అమరావతి ప్రచారకర్తగా నియమించారు. తాజాగా వైష్ణవి, మరోమారు సీఎంగా చంద్రబాబే రావాలంటూ ప్రత్యేక పూజలు జరిపి మొక్కుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజున రూ. 10 వేలు హుండీలో వేస్తానని శ్రీసువర్చాలా సమేత ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాములకు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసింది. తన తండ్రి డాక్టర్‌ మనోజ్‌ తో కలిసి ఈ పూజలు చేసిన వైష్ణవి, తాను ఇప్పటికే తిరుపతి వెంకటేశ్వరస్వామికి రూ. లక్ష కానుకగా సమర్పించి చంద్రబాబు గురించి మొక్కుకున్నానని తెలిపింది.
Vaishnavi
Chandrababu
CM
Andhra Pradesh
Amaravati

More Telugu News