'వైసీపీలో చేరిన చంద్రబాబు' అంటూ పోస్ట్... రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు!

షార్ట్స్‌లో చూడండి
రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైసీపీలో చేరిపోయారంటూ, ఓ మార్ఫింగ్ ఫోటోను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిమానులతో పంచుకోగా, అది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. చంద్రబాబును అవమానించేలా సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టింగ్‌ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌ లోని బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఫేస్‌ బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో సీఎంను అవమానపరిచేలా మార్ఫింగ్‌ ఫోటోలను పెట్టారంటూ, ఇదే ప్రాంతానికి చెందిన దేవి వీర వెంకట సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Ramgopalvarma
Police

More Telugu News