Guntur District: వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఎస్పీకి ఫిర్యాదు

  • పోలింగ్ రోజున వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి
  • నిందితులపై చర్యలు చేపట్టాలి
  • వినతి పత్రంలో కోరిన వైసీపీ నేతలు
ఈ నెల 11న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున వైసీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ నేతలు జరిపిన దాడులపై గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకి ఆ పార్టీ నేేతలు ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రూరల్ ఎస్పీకి ఓ వినతిపత్రం సమర్పించారు. ఎస్పీని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, మేరుగ నాగార్జున, కాసు మహేశ్ తదితరులు ఉన్నారు. కాగా, గుంటూరు జిల్లాలో టీడీపీ దాడులపై వైసీపీ నిజనిర్ధారణ కమిటీ నియమించింది. 
Guntur District
YSRCP
sp
umma reddy
ambati

More Telugu News