Telangana: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం!

షార్ట్స్‌లో చూడండి
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కోదాడకు చెందిన కొంత మంది వ్యక్తులు ఆ మండలంలోనే ఉన్న తమ్మరబండపాలెంలో సీతారాముల కల్యాణం చూసేందుకని వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా కోదాడ సమీపంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద వీరి ఆటో ప్రమాదానికి గురైంది.

వీరి ముందు వెళ్లున్న వాహనాన్ని అధిగమించే యత్నంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయిణిస్తున్న వారిలో ఆరుగురు మృతి చెందారు. ఆటో నుజ్జునుజ్జయింది. స్థానికుల సాయంతో గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, ఈ ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను జగదీశ్ రెడ్డి ఆదేశించారు.
Go Back to Shorts
Telangana
talasani
Telugudesam
putta
sudhaker

More Telugu News