Chandrababu: చంద్రబాబు ఓటమిని నైతికంగా ఒప్పుకున్నారు: ఆనం రామనారాయణరెడ్డి

  • చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు
  • అధికారుల సహకారంతో బాబు గెలవాలనుకున్నారు
  • చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేశారు
చంద్రబాబు ఓటమిని నైతికంగా ఒప్పుకున్నారని వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఓటమి భయంతో ఉన్న చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని, ఓటమి తప్పదని భావించి చంద్రబాబు ఇతరులపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మెప్పించి కాకుండా అధికారుల సహకారంతో చంద్రబాబు గెలవాలనుకున్నారని ఆరోపించారు.

ఈవీఎం చోరీ కేసులో నిందితుడైన హరిప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ కూడా విధించారని, అలాంటి వ్యక్తిని ఈసీ వద్దకు ఎలా తీసుకెళతారని, తన ఓటు గురించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు ఓటమి తప్పదని అర్థమైందని, అందుకే, ఆ నెపాన్ని ఈవీఎంలపై వేయాలని హంగామా చేస్తున్నారని కలెక్టర్లు, ఎస్పీలను బెదిరించి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేశారని ఆనం ఆరోపించారు.
Chandrababu
Telugudesam
YSRCP
aanam
ramnarayna

More Telugu News