Andhra Pradesh: చంద్రబాబును ఇప్పుడు టీడీపీలోనే వింతగా చూస్తున్నారు!: కేటీఆర్ ఎద్దేవా

  • ఏపీ ఎన్నికలు చంద్రబాబు పాలనకు నిదర్శనం
  • కోడెల పోలింగ్ బూత్ లోకి వెళ్లి బట్టలు చించుకున్నారు
  • హైదరాబాద్ లో మీడియాతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు తమ పరిపాలనకు నిదర్శనమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు అక్కడి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బూత్ లోకి వెళ్లి బట్టలు చించుకున్నారని విమర్శించారు. ఢిల్లీలో త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఈరోజు కేటీఆర్ మాట్లాడారు.

నేతలు ఎవరైనా ప్రజాతీర్పును స్వాగతించాలనీ, అంతేతప్ప చంద్రబాబులా గగ్గోలు పెట్టకూడదని కేటీఆర్ తెలిపారు. తాను గెలిస్తే సాంకేతికత భేష్ అనే చంద్రబాబు, లేదంటే ఈవీఎంలదే తప్పని వాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీలోనే చంద్రబాబును వింతగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హుందాతనం ఉండాలని అభిప్రాయపడ్డారు. 
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Telangana
TRS
KTR

More Telugu News