amedkar: అన్ని వర్గాల వాడు అంబేద్కర్...ఆయన ఆశయాలు ఆదర్శనీయం: కేటీఆర్‌

షార్ట్స్‌లో చూడండి
దేశంలోని అన్నివర్గాల వాడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ అని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధానాలన్నీ అంబేద్కర్ చూపిన మార్గంలోనే సాగుతుంటాయని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ ఆనాడు చిన్నరాష్ట్రాల అంశాన్ని అంబేద్కర్ ఆలోచన చేయక పోయి ఉంటే ఈరోజు తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదన్నారు. తెలంగాణ సాధన కోసం అంబేద్కర్ విధానాలతోనే కేసీఆర్‌ ముందుకు వెళ్లారని చెప్పారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం విషయంలో జరిగిన వివాదంపైనా కేటీఆర్‌ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Go Back to Shorts
amedkar
KTR
TRS bhavan

More Telugu News