Andhra Pradesh: గొలుసులతో కట్టేయకపోతే కరుస్తాడేమో!: కేఏ పాల్ పై వర్మ సెటైర్లు

  • నర్సాపురంలో పాల్ నామినేషన్
  • అనంతరం రోడ్డుపై చిందులు, చిత్రవిచిత్ర హావభావాలు
  • ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పాల్ రోడ్డుపై గెంతుతూ, డ్యాన్స్ చేసుకుంటూ ఆనందం తట్టుకోలేక పరుగు అందుకున్నారు. అనంతరం కారులో ఎక్కి భీమవరం అసెంబ్లీ సీటుకు నామినేషన్ వేసేందుకు వెళ్లిపోయారు.

తాజాగా ఈ వీడియోపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యంగా స్పందించారు. ‘ఆయన్ను వెంటనే గొలుసులతో కట్టేయకపోతే కరుస్తాడేమో!’ అని సెటైర్ వేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వర్మ పాల్ వీడియోను పోస్ట్ చేశారు.
Andhra Pradesh
k apul
varma
RGV
Twitter

More Telugu News