Gangooly: ధోనీ కూడా మనలాగే సాధారణ మనిషేగా?: గంగూలీ

  • మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాగ్వాదం
  • ధోనీని తక్కువ చేసి మాట్లాడవద్దు
  • ధోనీ విజయాలను మరువరాదన్న గంగూలీ
గత వారంలో మైదానంలోకి దూసుకొచ్చి, అంపైర్లతో వాదనకు దిగి, తీవ్ర చర్చనీయాంశమైన మహేంద్ర సింగ్ ధోనీ వైఖరిని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెనకేసుకొచ్చాడు. అతను కూడా మనలాగే సాధారణ మనిషేనని, భావోద్వేగాలు ఉంటాయని, అతని పోటీ తత్వం ఎంత అసాధారణమో అందరికీ తెలుసునని అన్నాడు.

 ఏదో ఒక చిన్న ఘటన కారణంగా ధోనీని తక్కువ చేసి మాట్లాడరాదని అన్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ధోనీ సాధించిన విజయాలను మరువరాదని అన్నాడు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న గంగూలీ అభిప్రాయం ఒకలా ఉంటే, మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోలా స్పందించడం గమనార్హం. ధోనీపై 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా ఏ మాత్రం సరిపోదని, అతనిపై కనీసం రెండు లేదా మూడు మ్యాచ్‌ లు నిషేధం విధిస్తే, మరొకరు ఇలా చేయకుండా హెచ్చరించినట్టు అయ్యేదని అన్నాడు.
Gangooly
MS Dhoni
IPL

More Telugu News