Jagapathi Babu: అంతకుముందు సద్ది అన్నం తినేవాడ్ని, ఇప్పుడు గంజినీళ్లు తాగుతున్నా: జగపతిబాబు

షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు హీరోగా వెలుగొంది, ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో విలన్ గా మారిన నటుడు జగపతిబాబు. అయితేనేం, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఇప్పటికీ అగ్రహీరోలకు దీటుగా నిలుస్తున్నారు. తాజాగా, ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి అనేక వివరాలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రతిరోజూ రెండు గంటల పాటు యోగా చేస్తానని, ధ్యానం కూడా చేస్తానని వెల్లడించారు. మొదట ధ్యానంతో మొదలుపెట్టానని, ఆ తర్వాత క్రమంగా యోగా వైపు మళ్లానని తెలిపారు. తనకు యోగా అన్నా, ఆయుర్వేదం అన్నా ఎంతో నమ్మకం ఉందని జగపతిబాబు చెప్పారు.

ఇక ఆహారం విషయానికొస్తే తన శరీరానికి ఇబ్బంది కలిగించని ఆహారం మాత్రమే తీసుకుంటానని, గతంలో ప్రతిరోజూ ఉదయం సద్ది అన్నం తినేవాడ్నని, ఇప్పుడు గంజినీళ్లు తాగుతున్నానని వివరించారు. వాటితో పాటు అల్లం రసం, కొబ్బరినీళ్లు తాగుతానని చెప్పారు. ఒకప్పుడు మాంసాహారం బాగా తినేవాడ్నని, ఇప్పుడు ఆరోగ్యరీత్యా దాదాపు దూరంగా ఉన్నానని జగపతిబాబు వెల్లడించారు.
Go Back to Shorts
Jagapathi Babu
Tollywood

More Telugu News