ఏపీలో ఎన్నికలు జరిగిన తీరును తెలుసుకునేందుకు చంద్రబాబుకు దేవెగౌడ ఫోన్
- సీఈసీని కలిసిన చంద్రబాబు
- సుమారు రెండు గంటలపాటు భేటీ
- దేవెగౌడ, అఖిలేష్, ఫరూక్ అబ్దుల్లా నుంచి ఫోన్
అయితే ఈసీని కలిసి బయటకు వచ్చిన వెంటనే ఆయనకు మాజీ ప్రధాని దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నుంచి ఫోన్ వచ్చింది. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు, ఈసీ వ్యవహారశైలిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి రావాలని దేవెగౌడ ప్రత్యేకంగా చంద్రబాబును ఆహ్వానించారు. సమయం చూసుకుని పర్యటన వివరాలు తెలియజేస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.