Chandrababu: ఏపీలో ఎన్నికలు జరిగిన తీరును తెలుసుకునేందుకు చంద్రబాబుకు దేవెగౌడ ఫోన్

  • సీఈసీని కలిసిన చంద్రబాబు
  • సుమారు రెండు గంటలపాటు భేటీ
  • దేవెగౌడ, అఖిలేష్, ఫరూక్ అబ్దుల్లా నుంచి ఫోన్
ఎన్నికల నిర్వహణపై ఈసీ వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్న చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. సీఈసీతో సుమారు రెండు గంటల పాటు భేటీ అయిన చంద్రబాబు, వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడంలో ఇబ్బందులేంటని ప్రశ్నించారు. ఒకానొక దశలో ఈసీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈసీని కలిసి బయటకు వచ్చిన వెంటనే ఆయనకు మాజీ ప్రధాని దేవెగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నుంచి ఫోన్ వచ్చింది. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు, ఈసీ వ్యవహారశైలిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి రావాలని దేవెగౌడ ప్రత్యేకంగా చంద్రబాబును ఆహ్వానించారు. సమయం చూసుకుని పర్యటన వివరాలు తెలియజేస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.
Chandrababu
CEC
Devegouda
Farook Abdullah
Akhilesh Yadav

More Telugu News