KTR: బిడ్డ పదమూడేళ్లకే ఎంత ఎదిగాడు!: కొడుకును చూసి కేటీఆర్ ఆశ్చర్యం

షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియాలో ఎంతో క్రియాశీలకంగా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పుడప్పుడు తన కుటుంబ విషయాలను కూడా ట్విట్టర్ లో ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఆయన తన కుమారుడు హిమాన్షును హత్తుకున్న ఫొటో ట్వీట్ చేశారు. "కేవలం పదమూడేళ్ల వయసుకే మీ కొడుకు మిమ్మల్ని మించిపోతే గట్టిగా హత్తుకోవాలి అని కాకుండా మరేం కోరుకుంటారు మీరు?" అంటూ ప్రశ్నించారు. ఈ ఫొటో ద్వారా తన కొడుకుపై తనకు ఎంత ప్రేమ ఉందో చాటారు.


Go Back to Shorts
KTR

More Telugu News