akash: గోవా షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న 'రొమాంటిక్'

  • ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక శర్మ పరిచయం
  • త్వరలోనే తదుపరి షెడ్యూల్    
పూరి జగన్నాథ్ సొంత బ్యానర్లో ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్' రూపొందుతోంది. గతంలో పూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ పాడూరి, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ద్వారా కథానాయికగా 'కేతిక శర్మ' పరిచయమవుతోంది. కొంతకాలంగా ఈ సినిమా షూటింగు 'గోవా'లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తూ వచ్చారు.

తాజాగా 'గోవా' షెడ్యూల్ ను పూర్తిచేశారు. తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. ఇంతకుముందు ఆకాశ్ తో పూరి చేసిన ప్రేమకథా చిత్రం 'మెహబూబా' యూత్ ను ఆకట్టుకోలేకపోయింది. అందువలన ఈ సినిమాతో ఆకాశ్ ను హీరోగా నిలబెట్టాలని పట్టుదలతో పూరి వున్నాడు. అవుట్ పుట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ .. సంతృప్తి చెందిన తరువాతనే ముందుకు వెళ్లమని చెబుతున్నాడట. 
akash
kethika sharma

More Telugu News