Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు

  • సెట్స్ పైకి అల్లు అర్జున్ 19వ సినిమా
  • కథానాయికగా పూజా హెగ్డే 
  •  కీలకమైన పాత్రలో 'టబు'
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా ఈ రోజునే పట్టాలెక్కింది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఈ రోజునే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, 'టబు' ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఇద్దరు యంగ్ హీరోలను తీసుకున్నట్టుగా సమాచారం.

ఆ ఇద్దరిలో ఒకరు నాగార్జున మేనల్లుడు సుశాంత్ అయితే, మరొకరు నవదీప్. హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుశాంత్ కి హిట్ పడలేదు. ఇక నవదీప్ కి కెరియర్ ఆరంభంలో ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినా, ఆ తరువాత ఆయనకి అవకాశాలే లేకుండాపోయాయి. అలాంటి ఈ హీరోలిద్దరకీ ఈ సినిమాలో అవకాశం రావడం విశేషం. అమాయక చక్రవర్తి పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడట. ఇక నవదీప్ పాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి వుంది. ఇక మిగతా పాత్రల్లో రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. రావు రమేశ్ కనిపించనున్నారట. 
Allu Arjun
trivikram

More Telugu News