Allu Arjun: చేయి ఊపిన ఇద్దరు అభిమానుల కోసం కారు దిగివచ్చిన అల్లు అర్జున్

  • కొత్త సినిమా సందర్భంగా ఆసక్తికర ఘటన
  • ఎంతో ఆప్యాయంగా పలకరించిన బన్నీ
  • అభిమానులతో ఫొటోలు
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న అల్లు అర్జున్ దారిపక్కన ఇద్దరు వ్యక్తులు తనకోసం చేయి ఊపడాన్ని గమనించారు. వాళ్లు అందరిలాకాకుండా జన్మతః లోపంతో ఉన్నట్టు గుర్తించి వెంటనే కారు ఆపారు. వెళ్లి వాళ్లిద్దరిని ఎంతో ఆత్మీయంగా పలకరించి వాళ్లలో ఆనందం నింపారు. అంతేకాదు, బన్నీ వాళ్లిద్దరితో ఫొటోలు దిగి మరింత సంతోషంలో ముంచెత్తారు.
Allu Arjun
Tollywood

More Telugu News