Telangana: రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిందే కేసీఆర్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • సెక్రటేరియట్ ముఖం కేసీఆర్ చూడరు
  • పాలనా వ్యవస్థను ఆయన ప్రశ్నించడం విడ్డూరం 
  • ఐదేళ్లుగా గుర్తుకురాని అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా?
తెలంగాణలో కొత్త రెవెన్యూ వ్యవస్థను త్వరలో తీసుకొస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు కురిపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఐదేళ్ల నుంచి గుర్తుకురాని అవినీతి, కేసీఆర్ కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ కు రాని కేసీఆర్, పాలనా వ్యవస్థను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేల కోట్ల కమీషన్ల సొమ్మును ఖర్చు పెట్టారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Telangana
congress
mlc
Jeevan Reddy
kcr

More Telugu News