Andhra Pradesh: ఏపీలో పనిచేయని ఈవీఎంలు ఏర్పాటుచేసి కుట్ర రాజకీయాలకు తెరలేపారు!: టీడీపీ నేత యరపతినేని ఆగ్రహం

  • మోదీ, జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు పన్నారు
  • అయినా ఏపీ ప్రజలు మాకు అండగా నిలిచారు
  • గుంటూరు జిల్లాలో మీడియాతో టీడీపీ నేత
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ఎన్ని కుట్రలు పన్నినా ఏపీ ప్రజలు టీడీపీకే అండగా నిలిచారని తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పనికిరాని ఈవీఎంలను ఏర్పాటుచేసి కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల నియోజకవర్గంలోని ఏడు ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా అల్లర్లు జరిగాయని వ్యాఖ్యానించారు.

టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో యరపతినేని మాట్లాడారు. ఈసీపై చట్టపరంగా చర్యలు తీసుకునేవరకూ పోరాటం చేస్తామని యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Telugudesam
yarapatineni
YSRCP
Jagan
KCR
modi

More Telugu News