Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ లో ఎదుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

  • షోపియాన్ జిల్లాలో ఘటన
  • భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు
  • గహండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం
జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం నుంచి భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ లోని గహండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తిరుగుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.
Jammu And Kashmir
shopian
gahand
terrorists

More Telugu News