వీవీప్యాట్స్ స్లిప్పుల లెక్కింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీవీ ప్యాట్స్ స్లిప్పుల లెక్కింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ మరింత శ్రద్ధ చూపాలని కోరారు. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, బీజేపీకి అనుకూలంగానే ఈసీ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.


More Telugu News