Andhra Pradesh: పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరిగితే జగన్ ప్రశ్నించరేం?: సబ్బం హరి

  • పోలింగ్ ప్రక్రియ సవ్యంగా జరిగిందని జగన్ అంటున్నారు
  • ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పని చేయలేదు
  • ఈ విషయమై ప్రశ్నించేందుకు జగన్ కు భయమా?
ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరిగిన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీ నేత సబ్బం హరి స్పందించారు. విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు లేదా మూడు ఈవీఎంలు పని చేయలేదని అన్నారు. పోలింగ్ ప్రక్రియ సవ్యంగా జరిగిందని చెబుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ విషయమై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరిగినప్పుడు దీని గురించి ప్రశ్నించేందుకు జగన్ కు భయమెందుకు అని ప్రశ్నించారు.
Andhra Pradesh
vizag
Telugudesam
YSRCP
sabbam

More Telugu News