Delhi: ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • సీఈసీని కలవనున్న చంద్రబాబు
  • ఏపీలో పోలింగ్ తీరుపై ఫిర్యాదు 
  • బాబుతో పాటు ఎంపీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎంపీలు
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. బాబుతో పాటు సిట్టింగ్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం సీఈసీని కలిసి రాష్ట్రంలో పోలింగ్ తీరు, ఈవీఎంల తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. అర్ధరాత్రి వరకు ఓటర్లు వేచి ఉండాల్సిన దుస్థితిపైనా ఫిర్యాదు చేస్తారు. కాగా, ఈసీ తీరు, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. వీవీప్యాట్స్ లెక్కింపుపై సుప్రీంకోర్టులో టీడీపీ రివ్యూ పిటిషన్ వేయనుంది.
Delhi
Andhra Pradesh
cm
Chandrababu
CEC

More Telugu News