bhimili: భీమిలిలో నా గెలుపు ఖాయం: టీడీపీ నేత సబ్బం హరి

  • హోరాహోరి పోరులో టీడీపీ గెలవబోతోంది
  • నా విజయానికి కూడా చంద్రబాబే కారణమవుతారు
  • కేంద్రం సహకరించకపోయినా ఏపీ అభివృద్ధి  
భీమిలిలో తన గెలుపు ఖాయమని, టీడీపీ నేత సబ్బం హరి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరులో టీడీపీ గెలవబోతోందని, తన విజయానికి కూడా చంద్రబాబే కారణమవుతారని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ఏపీ అభివృద్ధి జరుగుతోందని అన్నారు.

చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో పట్టుదలతో ఉన్నారని అన్నారు. అమరావతి నిర్మాణం గ్రాఫిక్స్ అంటూ మాట్లాడుతున్న వారిపై ఆయన మండిపడ్డారు. ఏపీలో బీజేపీ ఖాతా కూడా తెరవదని జోస్యం చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతోందని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు.
bhimili
Telugudesam
sabbam hari

More Telugu News