kodela: స్పీకర్ కోడెలపై దాడి చేసిన వారి కోసం వేట మొదలు!

  • పోలింగ్ రోజున ఇనిమెట్లలో కోడెలపై దాడి
  • నిందితులను గుర్తించే పనిలో పోలీసులు
  • సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన
పోలింగ్ జరిగిన రోజున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన చొక్కాను కూడా చించేశారు. ఈ ఘటనలో గాయపడ్డ కోడెల స్పృహ కూడా కోల్పోయారు. మరోవైపు కోడెలపై దాడి చేసిన వ్యక్తుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇనిమెట్ల గ్రామానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఎస్సీ కాలనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
kodela
attack
Telugudesam
ysrcp

More Telugu News